కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి

Published: Friday August 27, 2021
జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ సతీష్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 26 ఆగస్ట్ ప్రజాపాలన : కేంద్రప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ కోడలు కేంద్రప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి వికారాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సహేతుకం కాదని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం అన ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక తెలంగాణ కూడలిలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మల్లా రెడ్డి కి యువజన కాంగ్రెస్ తరపున హెచ్చరిక జారిచేయడం జరిగింది. మా రేవంతన్న పై  మరొక సారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మంత్రి మల్లారెడ్డి అంతుచూస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులు రహీం, మతీన్, నిఖిల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, అశోక్ ముదిరాజ్, రజినీకాంత్,  నాయబ్ జానీ, సిద్దార్థ్ రెడ్డి, శేఖర్,  నవీన్ విజయ్, సందీప్ నాయక్, శేఖర్ కరీం, వినోద్, మహేష్, పర్మారెడ్డి, కృష్ణ, సిద్దు, వినయ్ యాదవ్అ, నూప్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.