ముఖ్యమంత్రి గారు మాపై దయ చూపండి - పలు కారణాలతో తొలగించబడిన హోంగార్డులు

Published: Tuesday May 17, 2022
 హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి‌ తొలగించబడిన తమపై దయ చూపాలని  హోంగార్డులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ని కలిసి తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం సోమాజిగూడ లో వారు
మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖ నే దైవంగా భావించి సేవలందించిన తమను ఉన్నత అధికారులు చిన్నపాటి కారణాలను చూపిస్తూ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తమను తిరిగి విధుల్లో తీసుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులు మంత్రులు ప్రజా ప్రతినిధులు కలిసి విన్నవించుకున్నా ఎలాంటి  ప్రయోజనం లేకుండా పోయిందని కన్నీరు పెట్టుకున్నారు.  మాలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతూ వస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని చెప్పులరిగేలా తిరుగుతున్న పట్టించుకోవడం లేదంటూ విచారం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ వేడుకున్నారు.
 
 
 
Attachments area