కాలుష్య రహిత వాతావరణానికి కృషి చేయాలి

Published: Friday April 23, 2021
- డా. బియస్ వి రాజు, డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్
శేరిలింగంపల్లి,, ప్రజాపాలన ప్రతినిధి : 22 ఏప్రియల్ ను ప్రపంచ భూ దినోత్సవం (ఎర్త్ డే) గా నిర్వహిస్తున్న సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట వారు సంస్థ ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. మార్పులకు ముందున్న భూస్థితిగతులను తిరిగి రప్పించాలనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ ఎర్త్ డే నాడు మొక్కలు నాటడంతో పాటూ వాతావరణ కాలుష్యాన్ని నివారించే చర్యలను చేపట్టాలని ఐక్య రాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డా. బియస్ వి రాజు, డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట తెలియజేశారు. ఇప్పటికే భూమి పై ఏర్పడుతున్న మార్పుల కారణంగా ఏర్పడుతున్న వినాశనాన్ని చవి చూశామని ఇకపైనైనా ప్రజలు భాద్యతతో వ్యవహరించి కాలుష్య రహిత వాతావరణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా పొంచుకొస్తున్న ప్రమాదాన్ని కని పెట్టి మనం వినియోగిస్తున్న కాలుష్యకారకాలను నియంత్రించడమే కాకుండా, వాటిని రీసైకిల్ చేసి లేదా వాటిని తిరిగి వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవడం చేయడం ద్వారా భూమిని కాపాడుకోవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న డా. సతీష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట అన్నారు. భూమి కాలుష్యరహితం కానంత వరకూ విశ్రమించకూడదనే నినాదంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డా. సతీష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట వారితో పాటూ డా. బియస్ వి రాజు, డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట, హైదరాబాదు - వైద్యులు డా. నిథిన్, డా. రమ్య, డా. సింధు, డా. యన్ రాజశేఖరం, డా. సంధ్య, డా. రిషికేష్, డా నవీన్ రెడ్డి, డైరక్టర్ డా. బిఎస్వీ రాజు, ఫాతిమా, సుధీర్, ఏవి రావులతో పాటు మార్కెంటింగ్ విభాగానికి చెందిన శ్రీ ఏవి రావు, శ్రీ సుధీర్ లు పాల్గొన్నారు.