75 ఏళ్లు నిండిన కుల హత్యలు ఆగడం లేదు ** డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్

Published: Thursday August 18, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 17 (ప్రజాపాలన, ప్రతినిధి) : కుల మత నిర్మూలన లో సమాజాన్ని నడిపించాల్సిన పోయి ఉపాధ్యాయుడే కులం పేరుతో విద్యార్థిని ఖండించి హతమార్చడం హేయమైన చర్య అని డివైఎఫ్ఐ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ అన్నారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల తో కార్తీక్ మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన తొమ్మిదేళ్ల ఇంద్ర మేగ్యల్ అనే బాలుడు ఉన్నత కులాల ఉపాధ్యాయుల కోసం కేటాయించిన తాగు కుండలోని నీళ్లను తాగినందుకు ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి శనివారం మరణించాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలోలోని "సరస్వతి విద్యా మందిర్ లో" జూలై 20న ఈ సంఘటన జరిగిందన్నారు. రాజస్థాన్ లో జరిగిన కులతత్వానికి అంటరానితనానికి  మరో ఉదాహరణ తప్ప మరొకటి కాదు అని అన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా విద్యారంగంలో కులవ్యవస్థ మారకపోవడం సిగ్గు చేటన్నారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని జాతి పై దాడి చేసిన ఆ ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ జిల్లా శాఖ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బోర్కుటే శ్యామ్ రావు, తిరుపతి, రాకేష్ లు పాల్గొన్నారు.