లార్డ్స్ స్కూల్ బీరప్ప జన్మదిన వేడుకలు

Published: Friday October 08, 2021
బాలాపూర్, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : చిన్నారుల మధ్య జరుపుకుంటున్న జన్మదిన వేడుకలు మనస్సుకు తృప్తిగా ఉందనీ ట్రేస్మ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బీరప్ప అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడో డివిజన్ కార్పొరేటర్ జన్మదిన వేడుకలను హస్తినాపురం కీర్తన పౌండేషన్ అనాధ ఆశ్రమంలో చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. అనాధలైన అభాగ్యుల చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి, చిన్నారులకు పండ్లు పంచిపెట్టారు. అదే విధంగా పుట్టినరోజు సందర్భంగా మధ్యాహ్నం విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లార్డ్స్ స్కూల్ నిర్వాహకులు బీరప్ప మాట్లాడుతూ.... నా పుట్టినరోజు అనాధల చిన్నారుల మధ్య జరుపుకుంటునందుకు ఆనందంగా, సంతోషంగా, మనస్సుకు తృప్తిగా ఉందని అన్నారు. గీతాంజలి లయన్ క్లబ్ సభ్యులందరూ 43వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.నన్ను (బీరప్ప) ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో లార్డ్స్ బీరప్ప సతీమణి సిద్దాల శ్రీలత, కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, లయన్ సుధాకర్ రెడ్డి, లయన్ వెంకటేశ్వర్ రెడ్డి, లయన్ సంపత్, జగదీష్, గుమ్మా రామకృష్ణ లు కలసి పిల్లల అందరి మధ్యలో కేక్ కట్ చేయించి బీరప్ప జన్మదిన వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.