పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలి

Published: Thursday September 30, 2021
బోనకల్, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు లో పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ తేదీన చలో హైదరాబాద్ కార్మిక శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సి ఐ టి యు) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది కార్మికులు కరోనా బారిన పడ్డారు నాలుగు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించటంతో కార్మికులు పడిన బాధలు వారి గోసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లారా చూసింది. కావున కార్మికుల సమస్యలు తీర్చడానికి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న కార్మిక సోదరులు అంతా పాల్గొనాలని కోరడం జరిగింది. అంతేకాకుండా వెల్ఫేర్ బోర్డ్ లో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని, 36వేల పెండింగ్ క్రైమ్స్ ను పరిశీలించి తక్షణమే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సంక్షేమ బోర్డు అడ్వైజరీ కమిటీ ని కార్మిక సంఘాల నాయకులతో నియమించాలని ఖాళీగా ఉన్న ఏ ఎల్ఓ, ఏ సి ఎల్, డి సి ఎల్, సీనియర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని కరోనా సమయంలో బోర్డు కార్డు రెన్యువల్ చేసుకొని కార్మికులకు కూడా నష్టపరిహారాలు అందించాలని, హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో వసూలు కాని బకాయిలను వెంటనే వసూలు చేయాలని, అక్రమంగా తరలించిన కోట్లరూపాయలను బోర్డు కు జమ చేయాలని, వెల్ఫేర్ బోర్డు లో ఉన్న నిధులను కొత్త స్కీములు పెట్టి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని, 60 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలని, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్, మరియు కార్మిక అడ్డాలో షెడ్ నిర్మించి మంచినీరు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, ప్రస్తుతం ఇస్తున్న స్కీమ్ లకు నిధులు పెంచాలి మరియు ప్రమాద మరణానికి 10 లక్షలు సహజ మరణానికి 5లక్షలు పెళ్లి మరియు ప్రసూతి కానుక లక్షకు పెంచాలని అదేవిధంగా వలస కార్మికుల పేర్లు నమోదు చేయాలని రాష్ట్రంలో కార్మికుల కొరకు నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేసి, పాత 29 చట్టాలను యధాతథంగా అమలు చేయాలని అన్ని రకాల కార్మిక సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి బోయినపల్లి వీరబాబు, ఎస్ కె ఖాదర్ బాబా (బుజ్జి) పరస గాని శ్రీను, మోర్ల లక్ష్మణ్, ఎస్ కె మీరసా, గుంటి శ్రీనివాస్, తిరుపతి రావు, మురళి, మరియు భవన నిర్మాణ మరియు ఇతర కార్మిక సంఘాల సభ్యులు పాల్గొనడం జరిగింది.