ముగింపు సందర్భంగాబాలోత్సవంలో ఎయిడ్స్ ప్రచారం

Published: Friday November 18, 2022
 మధిర నవంబర్ 17 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం రాత్రి బాలల దినోత్సవ  ముగింపు సందర్భంగా ఎయిడ్స్ ప్రచారం

 శ్రీరామభక్త సీతయ్య కళాపరిషత్ జాతీయ స్థాయి బాలోత్సవ్  సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సామాజిక సేవకులు మధిర ఆశామిత్ర లంకా కొండయ్య బాలోత్సవానికి వచ్చిన పిల్లల తల్లి తండ్రులకు మరియు యువతకు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి సంపూర్ణంగా వివరించే కరపత్రాలను సాయంత్రం వేళ సభాప్రాంగణంలో ప్రతి ఒక్కరికి పంపిణి చేసారు. ఈ సందర్బంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై. ప్రభాకర్, బాలోత్సవ న్యాయ నిర్ణేత సీనియర్ కళాకారులు పాకాలపాటి రోశయ్య చౌదరి జిల్లా కాకతీయ కమ్మజన సంఘ సభ్యులు శ్రీ కళ్యాణo పుల్లారావు రామభక్త సీతయ్య కళాపరిషత్ అధ్యక్షులు, సెక్రటరీ శ్రీ పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్ బాబ్ల కన్వీనర్ మరోని భాయ్ సీనియర్ కళాకారులు కురిచేటి సత్యనారాయణరావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ మోహన్ జంగాల గురువులు కె. బిల రావు నిర్వాహకులు దినకరన్ తదితరులు చేతుల మీదుగా కొండయ్య ఏర్పాటు చేసిన స్టాఫ్ ఎయిడ్స్ టాక్ ఎయిడ్స్ చిత్రపటాన్ని బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి లంకా కొండయ్య హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన పరుస్తూ హెచ్ఐవి బాధిత కుటుంబాలకు ఆదరణ కల్పిస్తూ ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయటం అభినందనీయo అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో  వివిధప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులూ ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.