ఆశ వర్కర్ల సేవలు మరువలేనివని. ....ఎంపీపీ గడ్డం శ్రీనివాస్.

Published: Saturday September 24, 2022
దండేపెల్లి, సెప్టెంబర్23,ప్రజాపాలన:
ఆశ వర్కర్ల సేవలు మరువలేనివని
 దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ వర్కర్లకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్ దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆశ వర్కర్లు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ అరుణ,కొర్విచెల్మ ఎంపిటిసి ముత్తె రాజన్న,వైద్యసిబ్బంది,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.