ఉపాధి హామీ పనులు పరిశీలించిన సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Wednesday May 11, 2022
బోనకల్, మే 10 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు పరిశీలన చేశారు. అదేవిధంగా ఎన్ ఎస్ పి కాలువలు రైతులకు సరిగా నీళ్లు వచ్చే విధంగా కాలువ పనుల నాణ్యత మైనా పని చేసుకోని కూలీలు ఏండ త్రీవత ఉన్నందున సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి తెలియజేశారు. ఉదయం త్వరగా వచ్చి పనులు ముగించుకొని మీ యొక్క మాస్టర్ ఆన్ లైన్ చేయించుకుని పనులు చేసుకోవాలని సూచనలు, సలహాలు చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, పంచాయతీ కార్యదర్శి పరశురామ్, ఉపాధి మేట్లు కులీలు పాల్గొన్నారు.