మహిళా క్యాబ్ డ్రైవర్లకు శిక్షణ .. జిల్లా సంక్షేమ అధికారి

Published: Friday February 26, 2021

మంచిర్యాల, ఫిబ్రవరి25, ప్రజాపాలన ప్రతినిధి: మహిళా క్యాబ్ డ్రైవర్లకు శిక్షణ కొసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి గురువారం ఒక పత్రికా ప్రకటన లో పేర్కొన్నారు. మహిళల సౌకర్య వంతమైన రక్షణతో కూడిన ప్రయాణం కొరకు హైదరాబాద్ నగరంలో 24/7 షీ-టాక్సీ పథకమును ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 టాక్సీలను 16 మంది మహిళలకు క్యాబ్ డ్రైవర్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రవాణా శాఖ నమన్వయంతో అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఎవరైతే మహిళలు క్యాబ్ డ్రైవర్లుగా ఉపాధి పొందుటకు ఆసక్తి కలిగి ఉన్న వారికి 30 శాతం నబ్సిడీ, 10 శాతం మార్టిన్ మనీ మొత్తంగా 45 శాతంను బ్యాంక్ ఋణముతో కూడిన నబ్బిడీనీ, షీ-టాక్సీ పథకం ద్వారా మంజూరు చేయబడునని తెలిపారు. షీ-టాక్సీపథకం కింద వసతితో కూడు నన్న డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమాన్ని పూర్వ (10) జిల్లా కేంద్రాలలోని మహిళల ప్రాంగణాలలో ఇవ్వబడుతుందన్నారు. కోర్సు వ్యవధి 30 రోజులు, శిక్షణ సమయంలో దరఖాస్తు దారులు మహిళా ప్రాంగణాలలో వసతి కల్పించబడుననీ, బిలోపావర్జటీ లైన్ కు చెందిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడు తుందని అన్నారు. దరఖాస్తు దారురాలి వయ్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి, 10వ తరగతి అర్హత ఉండాలని తెలిపారు. కావున డ్రైవింగ్ శిక్షణ పొందగోరి (నేర్చుకోనుటకు ఆసక్తి కలిగి), ప్రొఫెషనల్ మహిళా క్యాబ్ డ్రైవర్ గా పని చేయుటకు అనక్తి గల అన్ని కేటగిరీలకు చెందిన మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవని కోరారు. దరఖాస్తులకు జిల్లా సంక్షేమ శాఖలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో కాని, సమగ్ర శిశు అభివృద్ధి పథకం కార్యాలయంలో కానీ సంప్రదించి దరఖాస్తు ఫారంను పొంది, వచ్చే నెల 02 లోగా మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించవలెనని పేర్కొన్నారు.