ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి *ప్రజానాట్యమండలి జిల్లా మూడవ మహాసభల సందర్భంగ

Published: Tuesday January 31, 2023

కళ కళ కోసం కాదు...కళాకాసుల కోసం కాదు...
కళా ప్రజల కోసం.. అనే నినాదంతో ప్రజలను చైతన్య చేస్తూ ప్రజానాట్యమండలి రంగారెడ్డి  జిల్లా మూడవ మహాసభలు  ఫిబ్రవరి 26 ,27 ,28 తేదీలలో ఇబ్రహీంపట్నంలో జరగబోతున్నాయి...

దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అడుగుజాడల్లో నడుస్తూ కష్టజీవుల పక్షాన సాంస్కృతిక మార్గంలో ముందుకు సాగుతుంది. ప్రజానాట్యమండలి. ఆదిశగానే ఆట పాట ప్రవహిస్తుంది.
పనిలో కష్టం మరిపించేందుకు మంచి మనిషి సృష్టించుకున్న కలను వారి కష్టాలను తుడిచే ఆయుధంగా మార్చింది ప్రజానాట్యమండలి.
ధనవంతులో కుబేరులుగా పేదలు మరింత పేదలుగా మారుతున్న ఈ తరుణంలో కరోనా వారి కష్టాలని రెట్టింపు చేసింది.
అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు సమస్యలను వదిలి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి ధనవంతులకు మద్దతిస్తూ పేదల్ని చీల్చేందుకు కుల మత పేరుతో చిచ్చులు రాజేస్తున్నాయి మీడియా ప్రచార సాధనాలని పావులుగా వాడుకుంటూ అనత్యాలను విస్తరింపజేస్తున్నాయి వీటన్నిటికీ దీటుగా బదులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జన చైతన్యం కోసం ప్రజా సంస్కృతిని కాపాడుకుంటూ ఏనాటికైనా మనిషి అజేయుడనే సత్యాన్ని వెలిగేత్తి చాటాలి ఈ కర్తవని దశాబ్దాలుగా నిర్వహిస్తోంది. గతంలో రంగారెడ్డి జిల్లాలో మూఢనమ్మకాల పైన అంటరానితనం పైన కులం పైన అనేక సాంస్కృతి కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి తనదైన శైలిలో ప్రజానాట్యమండలి ముద్ర వేసుకుం.ది ఇలాంటి తరుణంలో రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలు పోరుగడ్డ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో కళాకారులు తోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆధార అభిమానులతో జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.