శ్రీ శ్రీ శ్రీ దయానందగిరి స్వామీజీ శ్రీరామకోటి,శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞం,హోమాలు

Published: Wednesday June 15, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 14 ప్రజా పాలన ప్రతినిధిమెట్రో న్యూస్,యాచారం:మండలంలోని మేడిపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ రామకోటి సేవాసమితి నాంపల్లి వారి ఆధ్వర్యంలో,మేడిపెల్లి గ్రామసర్పంచ్ పాలకవర్గం, భక్త బృందం  సహకారంతో 12వ శ్రీ రామకోటి శ్రీలక్ష్మి శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞం  రెండు దినములు నిర్వహించగా చివరి రోజైన మంగళవారం శ్రీశ్రీశ్రీ దయానందగిరి స్వామీజీ సభాధ్యక్షత ఘనంగా శ్రీ రామకోటి జ్ఞాన ప్రవచనాలు, హోమాలు  నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన భక్తులకు,ప్రజానీకందరికీ అన్నదాన వితరణ కార్యక్రమం సర్పంచ్ చిగురింత శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కుమ్మర సంఘం యువజనధ్యక్షులు యడాల గణేష్ నిర్వహించారు.సగటు మానవాళి జీవితాలలో  ఆధ్యాత్మికత దైవారాధన కరువైందని, మోక్ష మార్గానికి ప్రశాంతతకు దైవారాధన ముఖ్యమని శ్రీ దయానందగిరి స్వామీజీ ప్రజలకు సూచించారు.గ్రామ ప్రజలందరూ కుటుంబంతో సహా ఈ కార్యక్రమానికి  విచ్చేసి సమయం కేటాయించినందుకు సర్పంచ్ పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అలంపల్లి సత్యమ్మ కృష్ణ, ఎంపీటీసీ మొరుగు శివలిల రమేష్,మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి,మాజీ సర్పంచులు కర్నాటి రంగారెడ్డి,బోడ కృష్ణ,బాలరాజ్ గౌడ్,పాశ్చ బాషా,వార్డు సభ్యులు, కలకొండ బీరప్ప భక్తులు గ్రామ ప్రజలు, ఎంఎన్ఆర్ టీం సభ్యులు   తదితరులు పాల్గొన్నారు.