తాండూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Published: Thursday October 06, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో శ్రీ సాయి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురభి  ఫంక్షన్ హాల్ లో మంగళవారం రక్త దాన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా  క్లబ్ అధ్యక్షుడు లయన్ సురభి ఆగమ రావు మాట్లాడుతూ, సేవే పరమార్దoగా  క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 
మండల ప్రజల కోసం  దాతల సహకారంతో బాడీ ఫ్రీజర్ అందుబాటులో ఉంచామని,  సెప్టెంబర్ 24 న కంటి పరీక్షలు నిర్వహించి, పలువురికి ఆపరేషన్లు సహితం చేయించామని, సేవలో భాగంగానే మంగళవారం  రెడ్ క్రాస్ సొసైటీ  సహకారంతో రక్త దాన శిబిరం ఏర్పాటుచేసి 35 యూనిట్స్ బ్లడ్ సేకరించి, రెడ్ క్రాస్ సొసైటీ టెక్నికల్ సూపర్ వైజర్   విజయ్ కుమార్ కు అందజేశామన్నారు .
ఇక ముందు దాతలు ముందుకొస్తే సమాజానికి ఉపయోగపడే,  మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ దుద్దిళ్ల నారాయణ రావు  మాట్లాడుతూ క్లబ్ ప్రారంభం అయిన   తక్కువ రోజుల్లోనే ఒకటి కంటి అపరేషన్ శిబిరం,  రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం పట్ల క్లబ్బు సభ్యులను అభినందించారు.
రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టి
 ప్రజలకు  సేవ చేయాలని కోరారు.
ఆపద కాలంలో రక్తం అందక ఎంతో మంది ఇబ్బoది పడుతున్నారని అదేవిదంగా తలసేమియా వ్యాది ఉన్న వారికి ఇలాంటి రక్త దాన శిబిరం చాలా  ఉపయోగ పడుతుందని,  క్లబ్ సభ్యులు అందరూ కలిసి కట్టుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన
జడ్పీటీసీ సాలిగామ బాణయ్య, ఎంపీటీసీలు.రజిత ,సిరంగి శంకర్,సింగల్ విండో ఛైర్మెన్ ఎస్. దత్తుమూర్తి 
 ,లయన్ , ఎస్.మహేందర్ రావు ,మాజి జడ్పీటీసీ మంగపతి సురేష్,లను  క్లబ్ సభ్యులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈకార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లయన్ బండి సత్యనారాయణ,కోశాధికారి  కటకం గట్టయ్య,
  ఉపాధ్యక్షుడు  చౌటపల్లి రంగారావు,  ఎల్కా రామచందర్,  మద్దిబోయిన గోపాల్,  పెరిక రాజన్న,  గాజుల రమేష్. ఐడిదినేని సత్యనారాయణ,  రాపెళ్లి ఈశ్వరయ్య ,  రహేమత్ ఖాన్,
  శ్రీనివాస్,  పిట్టల వేణు,  దుర్గ చరణ్ , ఉప్పట్ల  సంతోష్ తదితరులు పాల్గొన్నారు.