ఉపాధి హామీ కూలీలు లకు పెండింగ్ బిల్లులు వెంబడే అందే విధంగా చూడాలని ఎంపీడీవో కు వినతిపత్రం అం

Published: Tuesday August 02, 2022

భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం ఇబ్రహీంపట్నం డివిజన్ సమితి ఆధ్వర్యంలో ఎండిఓ ను కలిసి వినతి పత్రం అందజేశారు ఉపాధి కూలీలకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి పూలే యాదయ్య తెలిపారు దాదాపుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఆరు నెలల నుండి పెండింగ్ బిల్లులు రాక కూలీలు కార్యాలయం చుట్టూ తిరుగుతూన్న అధికారులు పట్టించుకోవట్లేదు బిల్లులు రాక  పుటగడవక కూలీలు పొట్ట చేత పట్టుకొని గ్రామాలను వదిలి పట్టణాల వలసలు పోయి అడ్డ కూలీలుగా మారుతున్నారు. పెండింగ్ బిల్లులు ఇప్పించి తగు న్యాయం చేస్తారని ఆయన తెలిపారు. వ్యవసాయ కూలీలకు ఎన్ని రోజులు పనులు చేసిన అన్ని డబ్బులు వస్తున్నాయో తెలియడం లేదు అధికారులు ఎన్ని దపాలు ధర్నాలు చేసిన ఓపెన్ ఫోరంలో చర్చించి ఇప్పటికీ ప్లేస్ స్లిప్పులు మెడికల్ కిట్టు టెంటు మంచినీరు సౌకర్యం లేక ఉపాధి హామీ కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పని ప్రదేశంలో కూలీల ప్రమాదాలకు గురై చనిపోతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు జాగ్రత్తగా పాటించక అయోమయంలో కూలీలు చనిపోతున్నారు. చనిపోయిన కూలీలకు జీవిత బీమా కింద 20 లక్షల మృతి కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు డబల్ బెడ్ రూమ్లో మంజూరు చేయాలని అదేవిధంగా దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుబంధం చేయడం విరమించుకోవాలని  ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని ఎలాంటి కోతలు లేకుండా రోజుకు 500 చొప్పున కూలి ఇవ్వాలని ఉపాధి హామీ పనులను జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని మున్సిపల్ నగర పంచాయతీలు ఉపాధి పనులు మొదలు పెట్టాలని ఉపాధి పనులు కల్పించే లేని ఎడల నిరుద్యోగ భృతి కల్పించాలని ఉపాధి హామీ పనులు అన్ని గ్రామాలలో మరియు అన్ని జిల్లాలలో మొదలుపెట్టాలని వ్యవసాయ కార్మికుల కూలీలలకు 50 సంవత్సరాలకే ₹3000 పింఛన్ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు శివరాల లక్ష్మయ్య, సిపిఐ మండల కార్యదర్శి పూల యాదయ్య, మండల నాయకులు సత్తయ్య, ఏఐటియుసి డివిజన్ నాయకులు విజయ్ కుమార్, మండల నాయకులు బి గాలయ్య పాల్గొన్నారు.