అర్ధరాత్రి ఆకతాయిల ఆగడాలు కారుధ్వంసం

Published: Thursday May 20, 2021

బెల్లంపల్లి, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో లాక్ డౌనిబంధనలను ఉల్లంగించి మంగళవారం రాత్రి తాగిన మైకంలో కారును ధ్వంసం చేసిన సంఘటన బెల్లంపల్లి లో జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని ఒకటవ వార్డు  కన్నాల బస్తి మధునన్న నగర్ లో మాదరి శ్రీధర్ కు చెందిన ఐ 20 కారును తన ఇంటికి సమీపంలో పార్కింగ్ చేసి పెట్టు కోగా మంగళవారం అర్ధరాత్రి అదే బస్తీ కి చెందిన కోక్కుల సాగర్ అతని అనుచరులు మరో నలుగురితో కలిసి కారుపై దాడి చేసి అద్దాలు వైపరులు ధ్వంసం చేశారని వారిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై బండలతో దాడి చేస్తూ పారిపోయారని వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి నిందితుల ఇళ్లల్లో సోదాలు చేయగా వారు పారిపోయినట్లు తెలిపారు. జరిగిన సంఘటన విషయమై స్థానిక  వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సి ఐ ముస్కే రాజు పర్యవేక్షణలో ఎస్ఐ రాములు, సిబ్బంది కేసు విచారణ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా మధునన్న నగర్ పోచమ్మ గుడి వద్ద స్థానిక ఇళ్లల్లో ఉండే కొంతమంది యువకులు జులాయిగా తిరుగుతూ గుడి ప్రాంగణంలోనే గంజాయి మద్యం సేవిస్తున్నారని ఎవరైనా ఇదేమిటి అని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి కొందరిని క్షమాపణలు చెప్పించి వదిలిపెట్టిన వారి పరిస్థితిలో మార్పు రావడం లేదని ఇప్పటికైనా పోచమ్మ గుడి వద్ద మద్యం గంజాయి సేవించకుండా అలాంటి పనులు చేసే ఆకతాయిలను పట్టుకొని చట్ట పరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రిళ్లు పోచమ్మ గుడి ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేశారు.