దళిత విద్యార్థిని లావణ్య కుటుంబాన్ని ఆదుకోవాలి

Published: Thursday July 22, 2021

మంత్రి, కలెక్టర్, భరోసా ఇవ్వాలి
ఎంఎస్పి జిల్లా కోఆర్డినేటర్ రేగుంట మహేష్

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 21 (ప్రజాపాలన) వనపర్తి పట్టణములో ఆత్మహత్య చేసుకుని మరణించిన దళిత విద్యార్థిని లావణ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని, మంత్రి కలెక్టర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వాలని ఎంఎస్పి జిల్లా కోఆర్డినేటర్ మహేష్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ విద్యకు నిధులు కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్న తెరాస ప్రభుత్వం స్కాలర్ షిప్ విడుదలలోజాప్యం తోనే లావణ్య ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రుల పై భారం పడుతుందని, ఫీజుల చెల్లింపు కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తు, యాజమాన్యాలు విద్యార్థులను, నిరుద్యోగులను, విద్యావంతులను, చులకనగా చూస్తూ మాట్లాడడంతో మనోవేదనకు గురై ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. బాధిత దళిత విద్యార్థిని లావణ్య కుటుంబానికి ప్రభుత్వం రూ 50 లక్షలు ఇవ్వాలని, తల్లిదండ్రులకు మిషన్ భగీరథ లో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని, లావణ్య తమ్ముడికి ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసి, దళిత బంధు పథకం ద్వారా మొదటి లబ్ధిదారులుగా వనపర్తి నియోజకవర్గంలో ఆ కుటుంబానికి సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రజా ప్రతినిధులు విద్యార్థులను, నిరుద్యోగులను, చులకనగా చేస్తూ మాట్లాడడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ప్రైవేట్ యూనివర్సిటీ లలో రిజర్వేషన్ అమలు లేకపోవడంతో ఉన్నత విద్య పేదలకు దూరమయ్యే అవకాశం ఉందని, యూనివర్సిటీలలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. దళిత విద్యార్థిని లావణ్య కుటుంబానికి న్యాయం చేయాలని, లేని ఎడల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంకు పిలుపునివ్వడం జరుగుతుందన్నారు.