ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వం

Published: Friday December 30, 2022

జన్నారం, డిసెంబర్ 29, ప్రజాపాలన: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని బీసీ సంఘాల ఐక్య పోరాట సమితి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కాడర్ల నరసయ్య అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు ఎప్పటికీ నిర్మింప చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా గత తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో పరిపాలన కొనసాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ కులాల వారికి 41 కులాలకు ఆత్మగౌరవ భవనాలు ప్రభుత్వపరంగా నిర్మింపజేస్తామని హామీ ఇచ్చారు. ఈ బిసి కులాల వారికి ఆత్మగౌరవాన్ని నిలబెడుతానని 2018 అసెంబ్లీ ఎన్నికలలో మేనిఫెస్టోలో ప్రకటించి ఉపన్యాసంలలో కూడా పేర్కొని 9 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ హామీ ఇప్పటివరకు అనేక కులాల వారికి ఆత్మగౌరవ భవనాలను పునాదిరాళ్లు కూడా వేయలేదన్నారు. రాబోయే 2023 సంవత్సరం ఎన్నికలకు సమయం శంకుస్థాపనలు జరిపి మరోసారి వివిధ కులాల వారిని మోసం చేయడమే ప్రణాళికగా కొనసాగుతున్నదన్నారు. బీసీ కులాలలో కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఆశ పెట్టడంతో ఆ ఆశ కూడా 9 సంవత్సరములు పూర్తి చేసుకున్నది బీసీ కులాల కులాల వారికి ఇచ్చిన హామీ నెరవేస్తే లేదన్నారు. నిరుద్యోగులకు 2016 రూపాయలు బృతి ఇస్తానని ప్రకటించి 2018 సంవత్సరం ఎన్నికల్లో గద్దె ఎక్కినారు నిరుద్యోగులను మోసగిస్తురన్నారు. ఈ విధంగా అడుగున బిసి యువతి యువకులు గృహస్తులు తీరని మోసాన్ని ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికలలోపుగా 2023 లోగా ఈ బీసీ కులాల వారికి సమస్యలను పరిష్కరించాలని, పరిష్కరించని యెడల టిఆర్ఎస్ కు వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సమితి అదిలాబాద్ జిల్లా నాయకులు కోడూరి చంద్రయ్య, కాసెట్టి లక్ష్మణ్, కోడిజుట్టు రాజన్న, కే ఏ నరసింహులు, దండవేణి చంద్రమౌళి, మామిడి విజయ్, శ్రీరాముల గంగాధర్, మర్రిపల్లి అంజయ్య, రమేష్, శిరవేణి పెద్దిరాజం, సింగ సాని సంతోష్, తదితరులు పాల్గొన్నారు.