వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించాలి

Published: Friday November 26, 2021
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజాపాలన : వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. శుక్రవారం ఎఐసిసి, టిపిసిసి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంఎల్ఏ, డిసిసి అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టరుకు డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మరియు నాయకులు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వెంటనే మద్దతు ధర ప్రకటించి వరి కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించాలని తెలియచేసారు. రైతులు ధాన్యాన్ని కాపలా కాస్తూ కుప్పలపై ప్రాణాలు విడుస్తున్నారని ఆయిన ప్రభుత్వం చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. అధికారులు ప్రారంభించాల్సిన ధాన్యం కొనుగుళ్లు కేంద్రాలను టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎలెక్షన్ కోడ్ పేరిట కావాలని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వరి ధాన్యంతో కల్లాలలో ఇబందులు పడుతుంటే ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడం తగదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకోసం ఎల్లపుడు పోరాడుతూ ఉంటుందని చివరి గింజ కొనేవారకు వదలమని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్, మండల అధ్యక్షులు పరిశురాంరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఎంఎ షాహిద్, ఫ్లోర్ లీడర్ జర్పుల శ్రీనివాస్ కౌన్సిలర్ షబ్బేనూర్ రియాజ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ వర్ధన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సర్వర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.