జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ట్రస్మా ఆధ్వర్యంలో మహా ధర్నా

Published: Tuesday October 05, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 04, ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటు పాఠశాలల వ్యతిరేక విధానాలపై ట్రస్మా మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట మహాదర్న నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు కు  వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమాంలో  ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు పాల్గొని మాట్లాడారు. గత 18 నెలలుగా కరోనా విపత్తు వలన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, సిబ్బంది  ఆర్థికంగా అనేక ఇబ్బందులతో చితికి పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగి ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు మళ్లించుకుంటు న్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల నిర్వీర్యం ఐతే వేలాది ప్రైవేటు టీచర్ల కుటుంబాలు వీదిన పడుతాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి సురభి శరత్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర్ల సిద్దయ్య, కస్తూరి పద్మ చరణ్, రాష్ట్ర నాయకులు కె.ప్రవీణ్ కుమార్, అఖిలేందర్ సింగ్, పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ పాష, మహిళా సభ్యులు పూలమ్మ, సభిహ సుల్తానా, జహీరా ఖాతుం, శిరీష, సునీత, అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు జిల్లా నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వంద మంది కరస్పాండెంట్ లు పాల్గొన్నారు.