ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించిన మైత్రి ఫౌండేషన్

Published: Thursday May 13, 2021

గుమ్మడిదల, మే 12, ప్రజాపాలన ప్రతినిది : గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుమ్మడిదల తహశీల్దార్ సుజాత హాజరై స్టాఫ్ నర్సులు జయంతి, ప్రతిభ, సావిత్రి లను శాలువాతో సన్మానించి మెమొంటో అందజేశారు  తహశీల్దార్ సుజాత మాట్లాడుతూ మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారని. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తు చేసుకుంటారని ఈ కరోనా సమయంలో కూడా నర్సులు నిరంతర సేవలందిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో గుమ్మడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డి జి ఓ శ్రీధర్ మైత్రి ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ కుమార్ గుమ్మడిదల గ్రామ దేవాలయ కమిటీ చైర్మన్ మద్దుల బాల రెడ్డి మైత్రి ఫౌండేషన్ ఆంబులెన్స్ పైలెట్ మేకల మహేష్ కుమార్ ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.