పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించిన కొక్కిరాల సురేఖ.

Published: Monday April 25, 2022
మంచిర్యాల బ్యూరో, ఎప్రిల్ 23, ప్రజాపాలన : ఈనెల 20 న గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం రెబ్బనపల్లి గ్రామ శివారులో పైప్ లీక్ అయిన సంఘటన లో పంటనష్టపోయిన రైతులకు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షురాలు సురేఖ రైతులకు ఆర్థిక సహాయం అందజేశారు.  పైపులైన్ లికేజీ తో వరదగా వచ్చన నీరు పంటలను ద్వంసం కావడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకుని గత రెండు రోజుల క్రితం ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డిసిసి అధ్యక్షురాలు సురేఖ లు పొలాలను సందర్శించి రైతులకు మనో దైర్యం నింపారు. ఈ సందర్భంగా వారు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం బాదిత రైతులకు డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆర్థిక సహాయంగా నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట నష్ట తీవ్రతను బట్టి 15000, 10000, 5000ల రూపాయల చొప్పున మొత్తం ఒక లక్ష రూపాయలు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ శేఖర్, పూదరి తిరుపతి, వడ్డే రాజమౌళి, సల్ల మహేష్, కూడా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు సురేఖ గారు మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాకు మూడు టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఈ పథకాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి గడ్డం నాగరాణి త్రిమూర్తి. పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు. ఎంపిటిసిలు ముత్యాల శ్రీనివాస్, తోట మోహన్, బొడ్డు కమలాకర్, కొంగల నవీన్, సర్పంచ్ బిళ్లకోరి శంకరయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బొప్పిడి మురళి కృష్ణ, ఎంబడి తిరుపతి, కొట్టే శ్రీనివాస్, సత్య గౌడ్, సురేష్, మల్లేష్ మండల కాంగ్రెస్ నాయకులు చిట్లా రమణ, దాసరి ప్రేమ్చంద్, కొత్త ధర్మయ్య, సురేందర్, ముద్దసాని వేణు, చుంచు నగేష్ ,ఆకుల తిరుపతి  చెన్నయ్య. మరియు రెబ్బనపల్లి గ్రామం సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.