ప్రతిపక్షాలు కు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు మంచి రెడ్

Published: Monday June 13, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 12 ప్రజాపాలన ప్రతినిధి

నిజాయితీగా నిరంతరం పని చేస్తున్న వ్యక్తి మంచిరెడ్డి కిషన్ రెడ్డి*

ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారు అని ఎన్నికల ముందు వారు వేసే వేషాలు ప్రజలు నమ్మరని జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్య నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజల తలలో నాలుకలా    మేదులుతాడని నిరంతరం నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వారిని జనం నమ్ముతారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల ముందు గుంపులుగా ప్రజల ముందుకు వచ్చి డ్రామాలు ఆడటం వెన్నతో పెట్టిన విద్య అని వారి నాటకాలను వినోదాత్మకంగా చూసే వివేకవంతులైన ప్రజలు వారిని ఎన్నికలలో తిరస్కరిస్తారని చెప్పారు. అభివృద్ధి అందాల గురించి మాట్లాడడం చేతగాక ఇతరులపై బురద జల్లడమే రాజకీయం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని వాస్తవాలను ప్రజలకు ఎక్కడికక్కడ వివరించాలని ఆయన సూచించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ప్రజలందరికీ చేరాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు టిఆర్ఎస్ వెంటే అడుగులు వేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ పాలనలో పల్లెలు పట్టణాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రజలతో మరింత మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సత్తి వెంకట రమణారెడ్డి, డి సి సి ఎస్ వైస్ చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్య, నోముల కృష్ణ గౌడ్, ఎంపీపీలు క్రుపేష్, నర్మదా, జెడ్పిటిసి చిన్నోళ్ళు జంగమ్మ, మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఆదిభట్ల వైస్ చైర్మన్ కోరే కలమ్మ , వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షులు బుగ్గ రాములు,  కర్నాటి  రమేష్ గౌడ్, కిషన్ గౌడ్, చీరాల రమేష్, మున్సిపల్ అధ్యక్షులు కొప్పుజంగయ్య, వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, అమరేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.