బనిగండ్లపాడు గ్రామంలో 73 వ గణతంత్ర వేడుకలు

Published: Thursday January 27, 2022
ఎర్రుపాలెం జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని బనిగండ్లపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర, నేతాజీ సెంటర్ నందు అంగ వికలాంగులైన బజ్జిగం నరసింహారావు, బలుసు పాటి మరియదాసు జెండాను ఎగరవేశారు, పంచాయతీ ఆఫీసు నందు సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, సొసైటీ నందు చైర్మన్ శీలం అక్కిరెడ్డి, సిద్ధారెడ్డి విగ్రహం దగ్గర ఎన్నం పిచ్చిరెడ్డి, హైస్కూల్ నందు ఇంచార్జ్ హెచ్ ఎం సత్యనారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రాజు, డాక్టర్ సుధాకర్ రైతు వేదిక దగ్గర ఇన్చార్జి ఏఈవో సుష్మ పతాకాలను ఎగురవేశారు. బనిగండ్లపాడు గ్రామంలో 73 వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సర్పంచ్ పుల్లారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ చేసిన సేవలను, రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనంగా అందరూ నడుచుకోవాలని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర్, సొసైటీ చైర్మన్ శీలం అక్కి రెడ్డి, మహిళా మండలి అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, ఎన్నం పిచ్చిరెడ్డి, వేమి రెడ్డి వెంకట్ రెడ్డి, రామ్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, స్వతంత్ర సమరయోధులు, కృష్ణారెడ్డి, ఆసుపత్రి సిబ్బంది, అద్దంకి నానయ్య, నండూరి పురుషోత్తం, పంచాయతీ సిబ్బంది, నూతక్కి నాని తదితరులు పాల్గొన్నారు.