తులేకలన్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ముందు ఏర్పాటు చేసిన టి ఎస్ టి ఆర్ ఎస్ పార్టీ ఫ్లెక్

Published: Tuesday August 17, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 ప్రజాపాలన ప్రతినిధి : వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్యగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా జంగయ్యగౌడ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలం తులేకలన్ గ్రామంలో బోనాల పండుగ  సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కనిపించకుండా విగ్రహానికి ముందు ప్లెక్సీ ఏర్పాటు చేయటం మహా దారుణమని ఈ సంఘటనని త్రివంగా ఖండిస్తున్నామన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రెండు సార్లు ముఖ్యమంత్రి గా గెలుపొంది ప్రజలకు మంచి పాలన అందించిన వైయస్సార్ విగ్రహం కనిపించ కుండ ప్లెక్సీ కట్టటం చాలా బాధాకరం అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక నియంతల ఇష్ట రాజ్యంగా రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది మాకు ఎమ్మెల్యే అండగా ఉన్నాడు మా వద్దకు ఎవ్వరు రారు మాదే రామ రాజ్యం అని ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వైయస్సార్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.  చర్యకు ప్రతి చర్య చేయటానికి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని  గుర్తుంచుకోవాలని అన్నారు.  ఒక పార్టీకి చెందిన విగ్రహానికి వేరొక పార్టీ ప్లెక్సీ కట్టటం నిజమైన రాజకీయ నాయకులు చేసే పని కాదు ఇది సరైన పద్ధతి కాదు  టిఆర్ఎస్ నాయకుల తీరు మారాలి వెంటనే తులకలన్ గ్రామంలో వైయస్సార్ విగ్రహానికి కట్టిన ప్లెక్సీ ని తొలగించాలి వైయస్సార్ విగ్రహానికి ప్లెక్సీ కట్టించిన స్థానిక నాయకులు మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా క్రమ శిక్షణ చర్య తీసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఫ్లెక్సీ తొలగించని పక్షంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ పెద్దలతో కలిసి పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం అని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు.