పలు కాలనీలలో పర్యటించారు బడంగ్ పేట్ మేయర్

Published: Tuesday April 20, 2021

బాలపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్ ; కరోనా సెకండ్ వే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని కార్పొరేషన్ మేయర్ అన్నారు. బాలాపూర్ మండలం బడంగ్ పేట్ మున్సిపల్  కార్పొరేషన్ పరిధిలోని 31 వ డివిజన్ లో ఉన్న టి ఆర్ ఆర్ కాలనీ, శ్రీ విద్యా టౌన్ షిప్ కాలనిలలో సోమవారం నాడు ఉదయం పర్యటించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ప్రపంచంలో కరోనా మహమ్మారి మళ్ళీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కాలనిలలో శానిటేషన్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ..... కాలనీవాసులు యావత్ తెలంగాణ ప్రజలందరూ  అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ అదే విధంగా మస్కులు ధరించాలని ప్రజలను కోరారు. ప్రజలు సురక్షితంగా ఎప్పుడైతే ఉంటారు ప్రజా ప్రతినిధులు కూడా క్షేమంగా ఉంటారని అన్నారు, ప్రజల కొరకు ప్రజల సమస్యల పై ఎప్పుడూ ఆలోచిస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని కాలనీ వాసులందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్సిపెక్టర్ యాదగిరి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.