బొగ్గు రవాణాకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలి

Published: Friday May 20, 2022

నస్పూర్, మే 19, ప్రజాపాలన ప్రతినిధి: వర్షాకాలంలో  ఉపరితల గనులనుండి బొగ్గు రవాణాకు ఆటంకం కలుగకుండా చర్యలు చేపట్టాలని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్,  డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, పా ఎన్.బలరాం తెలిపారు. గురువారం అన్ని ఏరియాల జీఎం లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ రాబోవు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపరితల గనుల్లో ముందస్తు చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉపరితల గనులలో నీటిని నిల్వ ఉంచకుండా, పంపుల ద్వారా ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండాలని, దానికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుని దానికి అనుగుణంగా పని చేయాలని సూచించారు. బొగ్గు రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండటానికి కావలసిన అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని 15 రోజుల వరకు సరిపోయేంత బొగ్గు నిల్వలు ఉంచుకోవాలని డైరెక్టర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ కుమార్,  శ్రీరాంపూర్ గ్రూప్ ఏజెంట్  విజయ భాస్కర్ రెడ్డి , శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వి.పురుషోత్తమ రెడ్డి, ఇందారం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎ.రాజేశ్వర్ రెడ్డి, డీజీఎం ఏరియా వర్క్ షాప్ చంద్రశేఖర్ రెడ్డి, సివిల్ డీజీఎం శివ రావు , ఐఈడి డీజీఎం చిరంజీవులు, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఇంజనీర్ రమేష్ పాల్గొన్నారు.