ఆరోగ్యమే మహాభాగ్యం మధిర రూరల్

Published: Friday September 16, 2022
 సెప్టెంబర్ 15ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడునిధానపురం గ్రామము నందు గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పోషణా మాసం కార్యక్రమంలో భాగంగా యుక్త వయసు బాలికలకు రక్తహీనత మరియు నివారణ చర్యలు, తీసుకోవలసిన ఆహారం గురించి అవగాహన కల్పించడం జరిగినది. అదేవిధంగా కిశోర బాలికలకు ఇట్టి కార్యక్రమం పై వ్యాసరచన పోటీ ఏర్పాటు చేసి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించడం జరిగినది.  బాలికల బరువులు, ఎత్తులు చూసి రక్త పరీక్షలు నిర్వహించడం జరిగినది. పిల్లలకు ఒక్కొక్కరికి హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉన్నది అని తెలియజేయడం జరిగినది. తక్కువ శాతం ఉన్న వారికి ఐ ఎఫ్ ఏ టాబ్లెట్స్ ఇచ్చి అవి ఏ విధంగా వేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. పోషణ ప్రతిజ్ఞ చేయనైనది. అదేవిధంగా ప్రాధమిక, హై స్కూల్ మరియు అంగన్వాడీ కేంద్రంలోని 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలకు నులి పురుగుల నిర్ములన కార్యక్రమంలో భాగంగా  అల్బెన్దజోల్ టాబ్లెట్స్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ బాదా కృష్ణారెడ్డి  సీడీపీఓ  శారద శాంతి ఏసీడీపీఓ వీరభద్రమ్మ మాటూరుపేట  వైద్యులు డాక్టర్ వెంకటేష్  సిహెచ్ఓ , ఏపిఎం ఐకేపీరాంబాబు సూపర్వైసర్  మాలతీ పంచాయతీ కార్యదర్శి హరి , పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణయ్య , వెంకటరమణ ,  రాజ్యలక్ష్మి , సీసీ ఐకేపీ మురళి  అంగన్వాడీ టీచర్స్ కృష్ణవేణి, లలిత, హైమావతి ఆశాలు పద్మ, మేరీ  వీవోఏ శిరోమణి, రాజేశ్వరి, నాగలక్ష్మి పంచాయతీ  సిబ్బంది, గ్రామపెద్దలు, తల్లులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area