విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు.

Published: Monday September 19, 2022
ప్రజా పాలన ప్రతినిధి.  సెప్టెంబర్ 18.  షాద్నగర్. రావిర్యాల గ్రామ శివారు శ్రీ గురుజాపు వరప్రసాద్ వ్యవసాయ క్షేత్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయి అందులో భాగంగా జండా ఆవిష్కరణ మరియు విశ్వకర్మ మహా యజ్ఞం జరిగినది ఈ యజ్ఞంలో 12 మంది దంపతులు పాల్గొని వారి జీవితాలను సఫలీకృతం చేసుకున్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి 8వ తరం ముని మనుమడు శ్రీశ్రీ వీరభద్ర స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి తాత గారి కాలజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సులభశైలిలో చెప్పినారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ గొలతి మల్లికార్జున రావు గారు ట్రస్టు అధ్యక్షులు మాట్లాడుతూ వేద పాఠశాలను ఈ సందర్భంగా ప్రారంభించారు అలాగే భవిష్యత్తులో వృద్ధాశ్రమమును కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలిపినారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా కే ఉమామహేశ్వరరావు గారు ట్రస్టు కార్యదర్శి అలాగే శ్రీమతి పట్నం సావిత్రి గారు మహిళా కార్యదర్శి పాల్గొన్నారు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ముఖ్యంగా రావిర్యాల గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అలాగే కార్యక్రమ చివరలో అడుగుల భజన డాక్టర్ బుచ్చలింగం గారి ఆధ్వర్యంలో జరిగిన రావిరాల గ్రామ ఉపసర్పంచి శివకుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు