నిర్లక్ష్యం వహిస్తే లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం: శివకుమార్

Published: Wednesday August 11, 2021
జిన్నారం, ఆగష్టు 10, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండల పరిధిలోని పలు గ్రామాలు జిన్నారం, గడ్డపోతారం, కొడకంచి, మాదారం, కాజిపల్లి గ్రామాలకు సంబంధించి ఆడిట్ రికార్డులను మరియు 2018 నుంచి 2021 వరకు వచ్చిన నిధులను వాటి ఖర్చులకు సంబంధించిన పూర్తి రికార్డులను ఇవ్వాలని మండల సమాచార అధికారిని సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ఏప్రిల్ నెలలో సమాచారన్ని సంగారెడ్డి జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం కమిటీ అధ్యక్షుడు శివ కుమార్ కోరడం జరిగింది, కానీ సుమారు మూడు నెలలు పూర్తి కావస్తున్నా వీటికి సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా సమాచార హక్కు రక్షణ చటం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ జిల్లా మీడియా కన్వీనర్ బండి మహేందర్ గౌడ్ పటాన్చెరు నియోజికవర్గ కన్వీనర్ నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం జిన్నారంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులు మరియు మంజూరైన నిధులు వాటి ఖర్చుల గురించి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుపై  ఎంపీడీవో సుమతి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ మరో నాలుగు రోజులు సమయం ఇవ్వాల్సిందిగా ఆమె కోరిందని వారు తెలిపారు ఈ నాలుగు రోజుల్లో పూర్తి సమాచారం ఇవ్వకపోతే వీరిపై లోకాయుక్త మరియు రాష్ట్ర సమాచార  కమిషన్ కు ఫిర్యాదు చేశామని జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పేర్కొన్నారు.