ఆధ్యాత్మిక సాధనలో ధ్యానమే విశిష్టమైనది

Published: Thursday November 25, 2021
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీ
వికారాబాద్ బ్యూరో 24 నవంబర్ ప్రజాపాలన : ఆధ్యాత్మిక సాధనలో ధ్యానమే విశిష్టమైదని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీ అన్నారు. బుధవారం కోటపల్లి పరిధిలోని నాగుసాన్ పల్లి సమీపంలో గల లైఫ్ యూనివర్సిటీ (క్వాంటమ లైఫ్ యూనివర్సిటీ) వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ న్యూటన్ జన్మదినం, యూనివర్సిటీ స్థాపన, ధ్యాన యోగ శిక్షార్థుల ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పత్రీజీ, డాక్టర్ న్యూటన్ కొండవేటిలు సంయుక్తంగా మాట్లాడుతూ మనిషిలో దాగివున్న ఆధ్యాత్మిక స్వభావపు జ్ఞానం, ప్రేమ, శాంతి, ఆనందం, శ్రేయస్సుల అంతులేని స్థితికి అనుసంధానంగా ఉంటుందని పేర్కొన్నారు. ధ్యాన శాస్త్ర కళను అభ్యసించడం నేటి మానవునికి అత్యంత ఆవశ్యకమని గుర్తు చేశారు. శ్వాస మీద ధ్యాస లగ్నం కఠినతరమైనదని చెప్పారు. మనస్సును ప్రాపంచిక విషయాల వైపు మళ్ళించకుండా క్రమక్రమంగా మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలన్నారు. అనంతమైన శక్తి, జ్ఞానం, ప్రేమ, శాంతి, ఆనందాలు అలవడుటకు సుమార్గం ధ్యానమన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న, పట్టణ అధ్యక్షుడు దావల్గారి ప్రభాకర్ రెడ్డి, యూనివర్సిటీ ఆధ్యాత్మిక గురువులు డాక్టర్ లక్ష్మీ న్యూటన్, ధ్యాన యోగ శిక్షార్థులు తదితరులు పాల్గొన్నారు.