మేఘశ్రీ హాస్పిటల్స్ లో వైద్యం పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత మాజీ జడ్పీటిసి బానోత

Published: Thursday April 13, 2023
బోనకల్, ఏప్రిల్ 12 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని బోనకల్ గ్రామానికి చెందిన గుగులోత్ పార్వతి, గుగులోత్ శ్రీనులు గతేడాది కోవిడ్ తో తీవ్ర అనారోగ్యానికి గురై మేఘశ్రీ హాస్పిటల్స్ నందు మెరుగైన వైద్య సేవలు పొందారు. అనంతరం మేఘశ్రీ హాస్పిటల్స్ నందు బిల్లులను పొంది టిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పీటిసి బానోత్ కొండ, బోనకల్ టిఆర్ఎస్ గ్రామశాఖ సహాకారంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో మంజూరు అయిన చెక్కులను ఆయన లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మేఘశ్రీ హాస్పిటల్స్ ప్రముఖ జనరల్ వైద్యులు టి పవనకుమార్ మాట్లాడుతూ.. మేఘశ్రీ హాస్పిటల్స్లో వైద్యం పొందిన వారికి టిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పీటిసి బానోత్ కొండ, టిఆర్ఎస్ బోనకల్ గ్రామశాఖ అండగా నిలిచి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసి మంజూరైన చెక్కులనుఅందజేయడం అభినందనీయమన్నారు. సిఎంఆర్ఎఫ్ చెక్కులు పొందిన లబ్దిదారులు మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై అత్యవసర సమయంలో ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ అండగా నిలిచిందన్నారు. సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక చొరవ చూపిన బానోత్ కొండకు, గ్రామశాఖకు లబ్దిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.