ఎస్సీలు భూములు కొంటే బెదిరింపులు * రెడ్డిల భూములు మాల మాదిగలు కొంటారా * బెదిరించేవారిపై ఎస్స

Published: Friday September 30, 2022

వికారాబాద్ బ్యూరో 29 సెప్టెంబర్ ప్రజా పాలన : ఎస్సీలు రెడ్డిల భూములు కొని మనుగడ కొనసాగిస్తారా అని బెదిరిస్తున్నారని నవాబుపేట్ మండల పరిధిలోని మీర్జాపూర్ గ్రామ రైతు సుభాష్ సిద్దులూరు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మున్సిపల్ పరిధిలోని అనంతగిరి హరివిల్లులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల పరిధిలో గల ఎల్లకొండ గ్రామానికి చెందిన గుంతల పర్మారెడ్డి కుమారుడు గుంతల నారాయణరెడ్డి 1987 మే 11న గుంతల బుచ్చిరెడ్డి భార్య గుంతల లక్ష్మికి సర్వే నంబర్ 322/అ లో గల 2 ఎకరాల 16 గుంటల భూమిలో నుండి 2 ఎకరాల భూమిని విక్రయించారు. 2016 నవంబర్ 11న గుంతల బుచ్చిరెడ్డి భార్య గుంతల లక్ష్మీ ఎల్లకొండ గ్రామానికే చెందిన శ్రీరాముల వెంకటరామిరెడ్డి భార్య శ్రీరాముల విజయలక్ష్మికి సర్వే నంబర్ 322అ ( 322/అ1) ప్రకారం 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2021 నవంబర్ 9న శ్రీరాముల వెంకటరామిరెడ్డి భార్య శ్రీరాముల విజయలక్ష్మి సర్వే నంబర్ ( 322అ) 322/అ1 లో గల 2 ఎకరాల భూమిని పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన సిద్దులూరు అనంతయ్య కుమారుడు సిద్దులూరు సుభాష్ కొనుగోలు చేసేముందు భూమికి సంబంధించిన అన్ని పత్రాలు భూ చట్ట ప్రకారం సక్రమంగా ఉన్నాయా లేవా అని సరిచూసుకొని కొన్నానని తెలిపారు. సుభాష్ కొన్న భూమిని చూడడానికి వెళ్తే గుంతల బుచ్చిరెడ్డి అతని కుటుంబ సభ్యులు దాడులు చేయడానికి వచ్చారని ఆరోపించారు. నేను కొన్న భూమిలోనికి వెళితే చంపుతారేమోనని భయాందోళన కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకునేందుకు ఏ అధికారి కూడా ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఢిల్లీలో గల ఎస్సీ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను అని చెప్పారు. ఢిల్లీ ఎస్సి కమిషన్ వారు దాడులు చేయడానికి వచ్చిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ కు తెలిపారని వివరించారు. స్థానిక పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరిన పోలీసులు పెడచెవిన పెడుతున్నారని అన్నారు. బెదిరింపు దారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి ప్రధాన రాజకీయ నాయకుల ఒత్తిల్లె కారణమని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీర్జాపూర్ గ్రామానికి చెందిన సుభాష్ సిద్ధులూరు భూములు కొనుగోలు చేయరాదా అని ప్రశ్నించారు. చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూమిపై హక్కులు కూడా దక్కవా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు చట్ట ప్రకారం నాపై బెదిరింపు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.