మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023

 

 

 
బోనకల్ ,ఏప్రిల్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని బిఆర్ అంబేద్కర్132 వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సిఐటియు ఆధ్వర్యంలో బోనకల్ గ్రామపంచాయతీ నందు అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎస్ కే ఖాదర్ బాబా (బుజ్జి) పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా గోవిందాపురం ఏ గ్రామంలో సర్పంచ్ భాగం శ్రీనివాసరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా  బిజెపి మండల కమిటీ  ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా చోప్పకట్లపాలెం గ్రామంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు  పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా నాయకులు  మాట్లాడుతూ  డాక్టర్ బీహార్ అంబేద్కర్  ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రూపకర్తగా అశేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం అని అన్నారు. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు అది మన బతుకులు మార్చే రధం ఉంటూ ఎన్నో అవమానాలను ఎదుర్కొని సమాజంలో అసమానతను రూపుమాపి అజ్ఞానతను తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించిన నాయకుడు బి.ఆర్ అంబేద్కర్ అని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, బిజెపి నాయకులు, తదితర నాయకులు పాల్గొన్నారు.