సేవకై జీవించు - సేవకై తపించు

Published: Wednesday February 10, 2021
మధిర, ప్రజా పాలన; ఆర్యవైశ్య పేద విద్యార్థి యోగేష్ కు న్యాయశాస్త్రం చదువుటకు ఫీజు చెల్లించిన శ్రీ పబ్బతి వెంకట మోహన్ రావు గారు గత 15 రోజుల క్రితం, మన ఆర్యవైశ్య సోదరుడు చిరంజీవి మిట్టపల్లి యోగేష్, ఖమ్మం - విద్యార్థి మంచి ర్యాంకు తో న్యాయశాస్త్రం నందు ఐదు సంవత్సరాలు అభ్యసించడానికి ఆర్థిక స్తోమత లేనందువలన  మన సేవా సమితి ద్వారా ప్రముఖ వ్యాపారవేత్త, సేవాతత్పరుడు పసురా కెమికల్స్ అధినేత శ్రీ పబ్బతి వెంకట మోహన్ రావు గారు స్పందించి, మాట ఇచ్చి ఈరోజు మొదటి సంవత్సరం  ఫీజు 29,000 రూపాయలు చెల్లించినారు. ఈ విద్యార్థి హైదరాబాద్ అరోరా లీగల్ సైన్స్ కాలేజీ  బండ్లగూడ నందు చేరినాడు. ఈ విద్యార్థికి చదువుతోపాటు, పార్ట్ టైం లో పనిచేయుటకు హైదరాబాద్ నందు ఉపాధి కల్పిస్తామని దాత శ్రీ పబ్బతి వెంకట మోహన్ రావు గారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా యోగేష్ వారి, తల్లిదండ్రులు, మధిర సేవా సమితి ద్వారా ఆర్థికంగా అందించి చేయూత నిచ్చిన పెద్దలు, ప్రముఖులు, దైవ సమానులు  శ్రీ పబ్బతి వెంకట మోహన్ రావు గారి  కుటుంబమునకు ధన్యవాదాలు తెలుపుతూ మా ఇంట సరస్వతీ దేవిని తరతరాలుగా అభివృద్ధి చెందుటకు, పాటుబడుతున్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.