స్వర్గస్తులైన ఇబ్రమ్ నరసింహ్మ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

Published: Monday June 28, 2021
బాలపూర్, జూన్ 27, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రామ్ శేఖర్ సోదరుడైన బాలాపూర్ నివాసులు ఇబ్రమ్ నరసింహ్మ(20/6/2021 నాడు) స్వర్గస్తులైనారు, ఆదివారం నాడు మాజీ వైస్ చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి, ప్రజాప్రతినిధులు, కో ఆప్షన్ సభ్యులు తో పాటు కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ నివాసానికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఇబ్రమ్ నరసింహ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.