వలస కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి ** ఏప్రిల్ 5న చలో ఢిల్లీ పోస్టల్ ఆవిష్కరణ ** సిఐటియు జిల

Published: Wednesday March 29, 2023

ఆసిఫాబాద్ జిల్లా మార్చి 28 (ప్రజాపాలన,ప్రతినిధి) : వలస కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఐటీయు పిలుపుమేరకు ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం గత 8 ఏళ్లుగా దేశంలో అమలు చేస్తున్న కార్పోరేట్ మతోన్మాద విధానాలను రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను, తక్షణమే విరమించుకోవాలని, అఖిల భారత సంఘాల పిలుపులో భాగంగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఫోర్ వేలో పనిచేస్తున్న వలస కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడుల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు 2022 ఉపసంహరణ, ఉపాధి హామీ బడ్జెట్ కేటాయింపులు, పని దినాలు 200 రోజులు పెంచి కనీస వేతనం రూ 600 ఇవ్వాలని ధరల ఎదుగుదల నియంత్రించడం, రైతు పండించే అంటకు మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు కు గ్యారెంటీ ఇవ్వాలన్నారు. వలస కార్మికులకు రక్షణ కల్పించి కనీస వేతనాలు రూ 26 ఇవ్వాలని, ఆరోగ్య, ప్రమాద, భీమా, సౌకర్యాలు కల్పించి డి బి ఎల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వలస కార్మికులు రమేష్, పోచమ్మ, పద్మ, విమల, పాల్గొన్నారు.