పంచాయతీ కార్యదర్శుల పని భారాన్ని తగ్గించండి

Published: Tuesday September 21, 2021
జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు రంగంపల్లి నర్సిములు
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజాపాలన : పంచాయతీ కార్యదర్శుల పని భారాన్ని తగ్గించాలని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు రంగంపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు భాగంలో ధర్నా నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిఎస్ఆర్, ఉపాధి హామీ పనులు వల్ల పని భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆఫీస్ వర్క్, హరితహరం, పరిశుభ్రత, స్మశాన వాటిక, రైతు వేదిక, ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, ఇతరత్రా అంశాల వంటి పనిభారంతో మానసిక వేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రోజుకు 12 గంటల పైన పని చేస్తున్నామని మాకు ఇంకా పని భారం పెంచే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. పనిభారాన్ని సంబంధిత అధికారులు స్పందించి తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు. పని భారాన్ని తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. రామక్రిష్ణ, రాములు, కిషన్ రెడ్డి, రాంరెడ్డి సురేష్ గౌడ్, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.