క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : కౌన్సిలర్ మల్లాది వాసు

Published: Wednesday October 06, 2021
మధిర, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని టిఆర్ఎస్ జిల్లా నాయకులు కౌన్సిలర్ మల్లాది వాసు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని హనుమాన్ కాలనీ యువతకు ఆయన వాలీబాల్ కిట్ ను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది వాసు మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంవల్ల ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. వ్యాయాయం చేయటం వల్ల ప్రజలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల ఐకమత్యాన్ని పెంపొందించడం తోపాటు, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారని ఆయన పేర్కొన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపి ముందుకుపోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.