నిరుపేద కుటుంబాలకు ఆత్మబంధువు కేసీఆర్ ఆసరా పెన్షన్లు భారీగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెల

Published: Friday September 02, 2022

బోనకల్, సెప్టెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆసరా పెన్షన్లు భారీగా మంజూరు చేసి నిరుపేద కుటుంబాలకు ఆత్మబందువు గా సీఎం కేసీఆర్ మారారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం నాడు మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలం లో కొత్తగా మంజూరు అయిన ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు ఆయన అందజేశారు. పెన్షన్లు తో పాటుగా లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ళు నిండిన వారికి టీ.ఆర్.ఎస్ సర్కారు పింఛన్లు మంజూరు చేసిందని 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 57 ఏళ్ళు పై బడిన వారికి పెన్షన్లు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ శుభ వార్త చెప్పారని కేసీఆర్ ఆదేశాలతో నేడు లబ్ధిదారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులు అందిస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవాలని ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపద్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు అయ్యాయని వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా కొత్త వారితో కలిపి ఈ సంఖ్య 45.41 లక్షలకు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 57 ఏళ్ళు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నెరవేరిందన్నారు. తాజాగా డయాలసిస్ పేసేంట్ లకు సైతం పింఛన్లు అందించాలని టీ.ఆర్.ఎస్ సర్కారు నిర్ణయం తీసుకుందని ఆ మేరకు వారికి కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమం లో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం అన్నారు.జిల్లాలో మొత్తం 49 వేల మందికి పైగా కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయని వేల సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు,నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.