జిల్లా వైద్య అధికారి స్వరాజ్యలక్ష్మి కి బీజేపీ నేతలు వినతి

Published: Wednesday May 05, 2021
బాలపూర్, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా టెస్టులను, వ్యాక్సిన్ సెంటర్లను పెంచాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా బిజెపి నేతలు జిల్లా వైద్య అధికారి స్వరాజ్యలక్ష్మి కి వినతి సమర్పించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కార్పొరేటర్ పెండ్యాల నరసింహ్మ ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారి స్వరాజ్య లక్ష్మి గారికి కరోనా వ్యాధి రెండవ స్టేజ్లో ఉంది. మీర్ పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  కరోన టెస్టులు 70 మాత్రమే, వ్యాక్సిన్ 100 టీకాలు మాత్రమే ఇస్తున్నారు. దీని వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్లో కూడా నమోదు కావడం లేదు కరోన టెస్టులను వ్యాక్సిన్  సెంటర్ లను  పెంచాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని జిల్లా వైద్య అధికారి గారికి వినతి పత్రం సమర్పించారు. వైద్యాధికారి స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి. కార్పోరేటర్లు ముత్తంగి కరుణానిధి పసునూరి బిక్షపతి చారి. భీమ్ రాజ్. సోమేశ్వర్. అమర్నాథ్ రెడ్డి. నాగేష్. పాండు. తదితరులు పాల్గొన్నారు.