తుర్కకాషాల సమస్యలను ప్రభుత్వo పరిష్కరించాలి

Published: Saturday May 21, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 20 ప్రజాపాలన ప్రతినిధి.తుర్కకాశల సమస్యలను పరిష్కరించాలని వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లపు విఘ్నేశ్  అన్నారు. శుక్రవారం కొయ్యడ దగ్గరలో ఉన్న వారిని కలిసి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా సామాజికంగా విద్య అందక వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికి కనీసం రేషన్ కార్డులు ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం గుర్తించి వారికి అంగా ఉండాలన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే వారికి 25 లక్షల గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాక్షికంగా కాలు చేయి విరిగితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గుట్టపైన పూర్తి హక్కులు ఇవ్వాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం వారికి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కోరారు. వారికి ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేయాలన్నారు. వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఇల్లు లేనివారికి డబల్ బెడ్ రూమ్ లో ఇవ్వాలని కోరారు .ఈ కార్యక్రమంలో హుస్సేన్,మద్దుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు