మాటూర్ హైస్కూల్ లో ఘనంగా హిందీ భాషా దినోత్సవం

Published: Wednesday September 15, 2021

మధిర, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్ చాంద్ బేగం ఆధ్వర్యంలో జాతీయభాష హిందీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నప్పటికీ జాతీయబాషగా హిందీ ఎంపికకావడం, ఆ భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తునదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమాచార్యులు తెలిపారు. పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు చాంద్ బేగం పాఠ్యంశాలతో పాటు సాంస్కృతిక అంశాలు అన్నింటిలో పిల్లలు పాల్గొనేలా వారిని తీర్చిదిద్దుతూ, చక్కని ప్రోత్సాహం అందించడం పాఠశాల విద్యార్థులు అదృష్టం అని పేర్కొన్నారు. అనంతరం చాంద్ బేగంను హిందీ దివస్ ను పురస్కరించుకొని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, మహ్మద్ చాంద్ బేగం, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.