రాష్ట్రంలో పాలన గాడిదల పాలనను తలపించేలా ఉంది..

Published: Friday February 18, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేది 17 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, 3016 నిరుద్యోగ భృతి తక్షణమే ప్రకటించాలని కోరుతూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనుకిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం  టెలిఫోన్ ఎక్స్చేంజ్ చౌరస్తా  TRS దిమ్మె ముందు గాడిదను తీసుకువచ్చి గాడిద మెడలో TRS కండువా వేసి కేక్ ఉంచి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.. ఎన్నికల ముందు TRS ప్రభుత్వం నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఉప ఎన్నికలు రాగానే కేసీఆర్ కు నోటిఫికేషన్లు గుర్తుకువచ్చి, ఎన్నికలు అయిపోగానే మర్చిపోవడం అలవాటుగా మారిందని, రాబోయే రోజుల్లో నిరుద్యోగులందరు కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు.. ఇప్పటికైనా తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి, 3016/- నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేసారు.. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి, ఇబ్రహింపట్నం జెడ్పిటిసీ భూపతిగళ్ల మహిపాల్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్ మాదిగ తో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు తాళ్ళ బాలశివుడు గౌడ్, చామ అనుకిరణ్ రెడ్డి, పర్వతి గణేష్ రెడ్డి, రామకృష్ణ యాదవ్, మంకాలా కరుణాకర్, రాఘవేందర్ రెడ్డి, పాశం జైహింద్, మహేష్, శ్రీకాంత్, టోనీ, శివ, భార్గవ్ తో పాటు తదితర యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.