ఘనంగా మాటూర్ హైస్కూల్ విద్యార్థుల స్వయం పరిపాలనా దినోత్సవ వేడుకలు

Published: Tuesday November 16, 2021
మధిర నవంబర్ 15 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులచే స్వయంపరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మధిర మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ మాట్లాడుతూ భావిభారత పౌరులైన విద్యార్ధులు భవిష్యత్ లో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించి మన దేశానికి ప్రతిభవంతులైన ఆదర్శ పౌరులు తయారు చేయాలనీసూచించారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఎక్కువ మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాల్గొని ఉపాధ్యాయ వృత్తిపై వారికి గల ఆసక్తిని ప్రశంసిస్తూ భవిష్యత్ లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మేడిశెట్టి లీలావతి, ఎస్ఎంసి చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణారావు, ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, మహ్మద్ చాంద్ బేగం, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.