రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్. ఎస్)ఆధ్వర్యంలో గురుపూజోత్సవం

Published: Monday July 11, 2022
రాయికల్, జూలై 10 (ప్రజాపాలన ప్రతినిధి):
హిందూ జీవన విధానంతో నే సనాతనధర్మపరిరక్షణ సాధ్యమవుతుందని ఆర్.ఎస్.ఎస్. జగిత్యాల జిల్లాసహసంఘచాలక్ డా: ఆకుతోటశ్రీనివాస్ రెడ్డీ రాయికల్ పట్టణంలో పి.వి.ఎస్ గార్డెన్ లోజరిగిన  ఆర్.ఎస్.ఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజా కార్యక్రమానికి ముఖ్యవక్తగాహాజరై ఉపన్యాసిస్తూ సంస్కృతిలోగురువుకు విశిష్టమైనస్థానంఉందని, వేదవ్యాసమహర్షి వేదాలు, పురాణాలు,ఉపనిషత్తులు అందరికి సులువుగా అర్థమయ్యేలాఅందించి ప్రపంచానికి జ్ఞానబిక్షపెట్టి విశ్వగురువయ్యారని, గురుపరంపరలో భాగంగా ప్రాచీనకాలంలోభారత్ ను విశ్వగురుస్థానంలోమన ఋషులు,మునులు నిలిపారని అన్నారు.  డాక్టర్ కేవరావ్ బలిరాంపంత్ హెడ్గేవార్ 1925 దసరాపండగారోజున ఆర్.ఎస్.ఎస్.ను స్థాపించి, రాష్ట్రీయస్వయంసేవక్ సంఘానికి గురువుగా(కాషాయ ధ్వజాన్ని) భగవాద్వజాన్ని ఏర్పాటు చేసారని, స్వయంసేవక్ సంఘం నిత్యశాఖల ద్వారా వ్యక్తినిర్మాణంతోపాటు జాతీయభావాన్ని పెంపొందిస్తుందనిఆన్నారు.  ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ్ నూతికట్ల సత్యం, టి.రవీందర్, బి.రాంగోపాల్,జి.అశోక్, వేల్పులస్వామి,గన్నవరం గంగాధర్,యం. లక్ష్మీనారాయణ, వాసం జలందర్, డి.జితేందర్ రెడ్డి, ఎన్.రఘుపతి రెడ్డి, భీమరాజు,స్వయంసేవకులు, తదితరులు పాల్గొన్నారు.