భారత రాజ్యాంగంపై విషం కక్కేందుకు ఏకమవుతున్న కుట్రదారులు

Published: Thursday February 03, 2022

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ఆరోపణ

కోరుట్ల, ఫిబ్రవరి 02 (ప్రజాపాలన ప్రతినిధి): భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని విషం కక్కేందుకు ఏకమవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభ్యుత్వాల పోకడ చూస్తుంటే మతోన్మాద శక్తుల చేతిలో రాజకీయ నాయకులు కీలుబోమ్మలుగా మారి కుట్రలు పన్నుతున్నారని అది దేశంలో, రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ఆరోపించారు. బుధవారం కోరుట్లలోని తన కార్యాలయంలో పేట భాస్కర్ మాట్లాడుతూ మహానుభావుడు బాబాసాహేబ్ బి ఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగంలో సమానత్వ స్వేచ్ఛ, హక్కులు కల్పించాడని వ్యవస్థలన్నింటికి మూలకారణమైన రాజ్యాంగం ప్రమాదంలో వుందని దాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై దళిత బహుజనలమైన మనందరిపై వుందని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలనే ఎంతటి శక్తులనైన ఎదుర్కొవలని, చిన్న రాష్ట్రల అవశ్యకతకై అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సిద్దించిందన్న కేసీఆర్ ఈరోజు రాజ్యాంగాన్ని ప్రక్షాళన చేయలంటున్నారంటే ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేట భాస్కర్ పేర్కొన్నారు. ఇకనైన తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించారు.