ఇబ్రహీంపట్నం జనవరి తేదీ ప్రజాపాలన ప్రతినిధి *" కంటివెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి : ఎ

Published: Thursday January 19, 2023

పేదల జీవితాల్లో నేత్ర సమస్యలు తొలగించి వెలుగులు నింపడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు పథకాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా  బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు , ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఈనెల 19 నుండి నేత్ర వైద్యులు గ్రామాలలో శిభిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారిని , అద్దాలు , రీడింగ్ గ్లాసెస్ అవసరమున్నవారిని గుర్తించి వాటిని అందజేయబడుతుందని అన్నారు. కంటివెలుగు శిభిరానికి హాజరయ్యేవారు తప్పకుండా తమ ఆధార్ కార్డును వెంట తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే  సూచించారు. నియోజకవర్గంలో ఈ పథకం అమలు తీరుతెన్నులపై తాను ప్రతిరోజూ ఒక మండలంలో , మున్సిపాలిటీలో పరిశీలిస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు , అధికారులు , నాయకులు ప్రత్యేకశ్రద్ధ తీసుకొని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. : సత్తు వెంకటరమణారెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ , రంగారెడ్డి జిల్లా.