వెల్గటూర్ లో కనుమ పండుగ సంబరాలు

Published: Monday January 17, 2022

వెల్గటూర్, జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : వెల్గటూర్ మండలంలో కనుమ పండుగ సంబరాలు నోములు పసుపు కుంకుమ సాంప్రదాయబద్ధంగా ఆదివారం రోజు జరుపుకున్న మహిళలు సంక్రాంత్రి ముందు రోజు భోగిపండగా సంక్రాంతి పండగ మరుసటి రోజు కనుమ పండుగ సందర్భంగా వెల్గటూర్ మండల్ ఆర్యవైశ్య మహిళలు మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో సంక్రాంతి  నోము అనంతరం కనుమ పండుగ రోజున మహిళలు వారి వారి గృహానికి ముత్తైదువలను ఆహ్వానించి పసుపు కుంకుమ ఇవ్వడం వారి ఆశీర్వచనం తీసుకోవడం తెలంగాణ సాంప్రదాయంలో భాగంగా నిర్వహించుకున్నారు. చిన్నపిల్లల  నోము చిన్నారులను దుర్గామాతగా గౌరీదేవిగా భావించి వారి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి వారికి చిన్న చిన్న కానుకలు ఇవ్వడం సాంప్రదాయం లో భాగంగా వారి ఆశీర్వచనం తీసుకున్నారు. సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు ఒకరికొకరు పసుపుకుంకుమలు ఇచ్చుకున్నారు. కార్యక్రమములో గోలి యశోద, రేగొండ మల్లేశ్వరి,గుంత ధనలక్ష్మి, గుంత సులోచన, ఉప్పు గండ్ల పుష్ప, జెశెట్టి అరుణ, నరేంద్ర కమల, గోలి శ్యామల పెద్ది శ్రీలత, భార్గవి, గుంత దీప్తి, భాగ్యలక్ష్మి, ఒజ్జల భాగ్యలక్ష్మి, పెద్ది శ్రీలత, గోలి సంధ్య, నరేంద్రుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.