జిల్లాలో పోషకాహార లోపం లేకుండా అధికారుల సమన్యాయంతో చర్యలు ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Wednesday September 07, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 06 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో పోషకాహార లోపం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఢిల్లీ నుండి నీతి అయోగ్ అధికారులు జిల్లాలో అమలు అవుతున్న సి, ఎస్, ఆర్, ప్రాజెక్టు నిర్వహణపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోషకాహార లోపాన్ని అధిగమించే విధంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ, అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఎదుగుదల లోపం, బరువు తక్కువ గల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, పాఠశాలలు కళాశాలల విద్యార్థిని, విద్యార్థుల, ఆరోగ్య పరిస్థితి పై ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దాదాపు 50 వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని, జిల్లాలో బి ఈ సి ఏవీఎం ఎల్ బి, డి, ఎల్, ఎం, ఐ, డి, హెచ్, ఏ, ఎన్, ఐ, హెచ్, ఎ, ఎల్,  పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మన ఊరు - మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో పది వేల ఎకరాలలో చిరుధాన్యాలు పంట సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తూ  తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉద్యానవన వంటల సాగుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా, వైద్య, వ్యవసాయ,బస్సు సంరక్షక శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.