ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 16 ప్రజాపాలన ప్రతినిధి ** ప్రగతి నివేదన పాదయాత్రకు బ్రహ్మరథం పడుతు

Published: Friday February 17, 2023

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 26వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి  గురువారం నాడు   ఇబ్రహీంపట్నం మండలం దుండుమైలారం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రతి కాలనికి గడప గడపకు తిరుగుతూ. ముఖ్యమంత్రి  కేసీఆర్ నాయకత్వంలో, ఎమ్మేల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను వివరిస్తూ. ప్రజలకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. మాజీ ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షులు ఎంపల్ల నిరంజన్ రెడ్డి, దండుమైలారం పార్టీ గ్రామశాఖ కార్యదర్శి ఇదులకంటి చంద్రయ్య, గార్ల చిత్రపటాలకు పూలమాలవేసి బంటి  నివాళులర్పించారు.
పాదయాత్రలో బంటి  రైతు, రైతుకూలీలతో కలిసి నడిచారు. ఆసంధర్బంలో ఏంపనులు చేస్తున్నారు, ఏంపంటలు వేశారని. రైతుబంధు, రైతుభీమా గురించి అడిగి తెలుసుకున్నారు.ఇబ్రహీంపట్నం నుంచి దండుమైలారం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి సుమారు 32.50కోట్లు, అదేవిధంగా కల్వర్టుల నిర్మాణం కోసం సుమారు 2.60కోట్లు ఖర్చు చేయటం జరిగింది. గత 8సంవత్సరాల నుంచి నోముల గ్రామంలో బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ త్రాగునీటి పైపులైన్, మరియు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తు, పూడికతీత. ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు 47.13కోట్లు రూపాయలను ఖర్చు చేసిందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం, మీగ్రామంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో కొన్నింటిని, లబ్దిదారుల కోసం చేస్తున్న ఖర్చు. ప్రతినెలా సుమారు 759మందికి వివిధ రకాల పెన్షన్ల కోసం దాదాపు 16.65లక్షలు  రైతుబంధు పథకం ద్వారా సుమారు 1330మంది రైతులకు దాదాపు 1.78కోట్లు రైతుభీమా పథకంతో సుమారు 19మంది రైతులకు దాదాపు 95 లక్షలు సీఎంఆర్ఎప్ పథకం నుంచి సుమారు 79మందికి దాదాపుగా 29.94లక్షలు  కళ్యాణలక్ష్మీ లేదా షాదీముబారక్ పథకంతో సుమారు 208 మందికి దాదాపు 1.89కోట్లు ప్రగతి నివేదన యాత్రలో భాగంగా దండుమైలారం నుంచి నెర్రపల్లి వెళుతున్న సంధర్బంలో యాసంగి సీజన్లో లో వరిపంట వేసిన రైతు వద్దకు వెళ్లి, రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. గతంలో రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారస్థుల వద్దకు వెళ్లి అధిక వడ్డీతో అప్పు తెచ్చుకునేవారు. కానీ కేసీఆర్  రైతులు అప్పులపాలు కావద్దని, పెట్టుబడి సహయం కోసం రైతులు ఇతరుల వద్ద చేతులు చాచే పరిస్థితి పోవాలని ఆలోచించి ప్రతి సీజన్లో ఎకరానికి 5వేల రూపాయలను రైతుబంధు ఇస్తున్నారు. ప్రగతి నివేదన యాత్రలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలకల బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పి కృపేష్, సర్పంచ్ మల్లీశ్వరీ జంగయ్య, సోసైటీ చైర్మన్ బి.వెంకట్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ యం. వెంకటేష్, గ్రామశాఖ అధ్యక్షుడు ఐలేష్, నాయకులు సి.జగన్నాథం, పి.కృష్ణ, రణదీర్ రెడ్డి, యం.శ్రీశైలం మరియు బీవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.